: గవర్నర్ తో అరగంటకుపైగా చర్చించిన చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాజ్ భవన్ లో జరిగిన వీరి సమావేశం అరగంటకు పైగా కొనసాగింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంది. ఈ అంశంపై వీరిరువురూ చర్చించారు.