: జూనియర్ సివిల్ జడ్జిల పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
జూనియర్ సివిల్ జడ్జిల పరీక్షకు సంబంధించిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. జడ్జిల నియామకానికి పరీక్ష నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతి తెలిపింది. ఈ క్రమంలో, పరీక్ష నిర్వహణపై స్టే ఇవ్వాలన్న టి.న్యాయవాదుల విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే, పరీక్షా పత్రాలను వాల్యుయేషన్ చేయకుండా సీల్డ్ కవర్ లో భద్రపర్చాలని కోర్టు ఆదేశించింది. తుది తీర్పు వచ్చాకే ఫలితాలు వెల్లడించాలని తెలిపింది. వారంలోపు పిటిషనర్లు తమ అభిప్రాయాలను తెలపాలని కోర్టు ఆదేశించింది.