: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్... టీమిండియాతో మ్యాచ్ ప్రారంభం
టీమిండియాతో జరగనున్న కీలక మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్-బీ లో జరుగుతున్న ఈ మ్యాచ్ కరీబియన్లకు కీలకంగా మారింది. క్వార్టర్స్ లో చోటుపై ఆశలు పెట్టుకోవాలంటే ఆ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించాల్సి తీరాలి. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే టీమిండియాకు క్వార్టర్స్ లో బెర్తు ఖరారైనట్టే. కొద్దిసేపటి క్రితం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్, తొలి ఓవర్ లో ఐదు పరుగులు సాధించింది. వెస్టిండీస్ సుడిగాలి గేల్ తో కలిసి డ్వేన్ స్మిత్ ఆ జట్టు ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు.