: అంబరాన్నంటిన హోలీ సంబరాలు... యువత ఉత్సాహం
హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాదుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు రంగులమయంగా మారాయి. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా మహిళలంతా ఒక చోట చేరి కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పరస్పరం రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. ప్రధానంగా యువత హోలీ వేడుకల్లో సందడి చేసింది. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశారు. మరికొద్దిసేపట్లో రాజభవన్ లో జరగనున్న హోలీ వేడుకల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు పాల్గొననున్నారు.