: సివిల్ సర్వీస్ అధికారుల కేటాయింపుపై కేంద్రం ఆమోదం


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సివిల్ సర్వీసెస్ అధికారుల కేటాయింపులపై కేంద్రం ఆమోద ముద్ర వేసింది. సివిల్ సర్వీస్ లను ఆమోదిస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారసుల మేరకు తెలంగాణకు 133, ఆంధ్రప్రదేశ్ కు 161 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు 116, తెలంగాణకు 95 మంది ఐపీఎస్ అధికారులను, ఏపీకి 69 మంది, తెలంగాణకు 58 మంది ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయించిన సంగతి తెలిసిందే. తాజా గెజిట్ నోటిఫికేషన్ తో వారి విభజన నియామకం పూర్తయినట్టే!

  • Loading...

More Telugu News