: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడుపై సీబీఐ కేసు
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడుపై విశాఖలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు ఎస్ బీఐ భీమవరం మేనేజర్ మూర్తిపైన కూడా కేసు నమోదైంది. 22 చేపల చెరువుల కోసం నకిలీ పత్రాలతో, మిత్రుల పేర్లపై సుబ్బారాయుడు దంపతులు రూ.5.7 కోట్ల రుణం తీసుకున్నారు. పత్రాలు నకిలీవని తెలిసినప్పటికీ బ్యాంక్ మేనేజర్ మూర్తి రుణం మంజూరు చేశాడు. ఈ విషయం బయటికి రావడంతో దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.