: రాహుల్ గాంధీ వచ్చే వారం తిరిగొస్తారు: కమల్ నాథ్
పార్లమెంటు సమావేశాల నుంచి రెండు వారాల పాటు సెలవు తీసుకుని, పార్టీ పటిష్టతపై మరింత దృష్టి పెట్టేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వచ్చేవారం ప్రారంభంలో ఆయన తిరిగొస్తారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కమల్ తెలిపారు. ఆ వెంటనే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారని చెప్పారు. బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకుండా రాహుల్ ఎక్కడికో వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో విమర్శలకు దారితీసింది. ఢిల్లీ ఎన్నికల్లో దారుణ ఓటమికి భయపడే రాహుల్ పరారయ్యారని పలువురు వ్యాఖ్యానించారు. రాహుల్ తిరిగొచ్చాక ఓ సమావేశం ఏర్పాటుచేసి పార్టీ అధ్యక్షుడిగా సోనియాగాంధీ స్థానంలో ఆయన్ను ఎన్నుకుంటారని వార్తలు వస్తున్నాయి.