: రక్తమోడిన అమెరికా రాయబారి


దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఓ వ్యక్తి అమెరికా రాయబారిని రక్తమోడేలా గాయపరిచాడు. దక్షిణ కొరియాలో అమెరికా రాయబారి మార్క్ లిప్పెట్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించేందుకు వేదిక వద్దకు చేరుకున్నారు. ఇంతలో వేదిక సమీపంలో ఉన్న కిమ్ కిజోంగ్ అనే వ్యక్తి రేజర్ బ్లేడ్ తో లిప్పెట్ పై దాడికి దిగాడు. అతనిని తప్పించుకునే క్రమంలో లిప్త పాటులో లిప్పెట్ కి దారుణమైన గాయమైంది. వెంటనే స్పందించిన పోలీసులు కిజోంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతను డోక్డో ద్వీపంలోని వాచ్ డాగ్ సంస్థకు చెందిన వ్యక్తని వెల్లడించాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా రాయబారి మార్క్ లిప్పెట్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News