: పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు: తలసాని
పన్నులు కట్టకుండా ఎగవేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. పన్నుల చెల్లింపులను కూడా ఆన్ లైన్ లోకి తీసుకొస్తామని చెప్పారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న ఆయన... నంది అవార్డుల పేరును మారుస్తామని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సినీపరిశ్రమకు నంది అవార్డులను ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం నంది పేరుతో కాకుండా, కొత్త అవార్డులను ఇచ్చే యోచనలో ఉంది.