: రాజధాని నిర్మాణానికి ప్రజలే స్వచ్ఛందంగా భూములిచ్చారు: మంత్రి నారాయణ
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రజలే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని ఏపీ మంత్రి నారాయణ చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టే రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం బాధాకరమన్నారు. 2018కి రాజధాని తొలి నిర్మాణం పూర్తికానుందని తెలిపారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లెలోని జయంపులో పర్యటించిన మంత్రి, విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో రేపు 50 మందితో కూడిన సింగపూర్ బృందం పర్యటించనుందని చెప్పారు. కృష్ణపట్నం ఓడరేవు, తడ ప్రాంతాలను బృందం పరిశీలిస్తుందన్నారు.