: మొన్నటిదాకా అత్యంత విశ్వాసపాత్రుడు... ఇప్పుడు చంద్రబాబుపైనే సెటైర్లు వేస్తున్నాడు


అదేం విచిత్రమో కానీ, పార్టీ ఏదైనా సరే, రాజకీయ నేతలు మాత్రం ఒకేలా ఉంటారు. ఓ పార్టీలో ఉన్నంత సేపు ఒక రకంగా, మరో పార్టీలోకి జంప్ కాగానే మరోలా మారిపోతుంటారు. ఇందుకు తాజా ఉదాహరణ టీఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మొన్నటి దాకా టీడీపీలో కీలక నేతగా ఉన్న తుమ్మల... చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు కూడా. కారణాలు ఏమైనా మనకు అనవసరం... ఆయన మాత్రం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని, ఏకంగా మంత్రి సీటులో కూర్చున్నారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబుకు ప్రత్యర్థిగా కూడా మారినట్టున్నారు. టీఆర్ఎస్ లో ఉన్న నేతలంతా తన స్కూల్ వారేనని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తుమ్మల విమర్శలు గుప్పించారు. తాము టీడీపీలో చేరినప్పుడు చంద్రబాబు ఆ పార్టీలో లేరని, కాంగ్రెస్ లో ఉన్నారని విమర్శించారు. ఎన్టీఆర్ స్కూల్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠాలు చెబుతున్నప్పుడు చంద్రబాబు వచ్చి చేరారని ఎద్దేవా చేశారు. అలాంటి చంద్రబాబు తన స్కూల్ లో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు చదివారని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు.

  • Loading...

More Telugu News