: బేతపూడిలో రైతులతో పాటు కింద కూర్చున్న పవన్... 'నేనున్నా, భూమి ఇవ్వని రైతులు భయపడకండి'
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ప్రస్తుతం బేతపూడి గ్రామంలో కొనసాగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రైతులతో పాటు పవన్ కూడా కిందే కూర్చుని మాట్లాడుతున్నారు. ముఖాముఖి జరుగుతున్న చర్చలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న పవన్... వెంటనే తన స్పందనను కూడా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ మాట్లాడుతూ, రైతులు సంతోషంగా భూములు ఇస్తే తనకు కూడా ఆనందమే అని చెప్పారు. అంతేకాని, రైతులను కన్నీటిపాలు చేసి, రాజధాని నిర్మిస్తామంటే తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. భూమి ఇవ్వడం ఇష్టం లేని రైతులు భయపడాల్సిన అవసరం లేదని... వారికి తోడుగా తాను ఉన్నానంటూ ధైర్యం చెప్పారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని చెప్పారు.