: త్వరలో తాతను కాబోతున్నా: నందమూరి బాలకృష్ణ
టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. ‘‘త్వరలోనే తాతను కాబోతున్నాను’’ అంటూ బాలయ్య చేసిన ప్రకటన ఆయన అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించింది. తూర్పుగోదావరి జిల్లా తునిలో నిన్న రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు బాలయ్య హాజరై సందడి చేశారు. స్నేహితుడు చల్లకొండ రమేశ్ కుమార్తె వివాహానికి హాజరైన బాలయ్య, త్వరలోనే తాను తాతను కాబోతున్నానంటూ ప్రకటించారు. బాలయ్య ప్రకటనతో అక్కడున్న ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు. బాలయ్య తన పెద్ద కుమార్తె బ్రాహ్మణిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుమారుడు, తన మేనల్లుడు అయిన లోకేశ్ కు ఇచ్చి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. బ్రాహ్మణి గర్భవతి అంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వినిపించాయి. తాజాగా బాలయ్య ప్రకటనతో ఆయనతో పాటు చంద్రబాబు కూడా త్వరలోనే తాత కానున్నారు.