: పిజ్జా, చాక్లెట్, ఫ్రెంచ్ ఫ్రైస్ కు అలవాటు పడనంత వరకే...!
పిజ్జాలు, చాకొలేట్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ కు అలవాటు పడనంతవరకూ ఫర్వాలేదట...అలవాటు పడితే మాత్రం వదులుకోలేమట. రుచి చూసి ఆగిపోతే ప్రమాదం లేదని, అదే అలవాటుగా మారితే మాత్రం ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇవి తినడానికి అలవాటు పడితే డ్రగ్స్ కు ఎలా అలవాటు పడతారో, అవి లేకుండా ఎలా ఉండలేరో అచ్చం అలాగే చాకొలేట్స్, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ ను కూడా వదులుకోలేరని వారు హెచ్చరిస్తున్నారు. ఇవి తినడానికి అలవాటు పడిన శరీరం ఎదుగుదలతో పాటు, ఆలోచనా విధానం కూడా మారిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. వాటికి దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని న్యూయార్క్ పరిశోధకులు సూచిస్తున్నారు.