: మేము మళ్లీ చెప్పే వరకు ఆ ఇంటర్వ్యూ ప్రసారం చేయవద్దు: ఢిల్లీ హైకోర్టు
నిర్భయ కేసు దోషి ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూను తాము ఆదేశించేంత వరకు ప్రసారం చేయవద్దని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముఖేష్ ఇంటర్వ్యూపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ డాక్యుమెంటరీ ప్రసారం నిలిపివేయాలని పోలీసులు న్యాయస్ధానాన్ని ఆశ్రయించడంతో, తాము చెప్పే వరకు ఏ మీడియా సంస్థ, పత్రిక ప్రచురించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరో ఆర్డర్ వచ్చే వరకు ఇదే వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా, బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్, బీబీసీ ఛానెల్ తో కలిసి తీహార్ జైల్లో ముఖేష్ ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.