: నా సినిమాకు టైటిల్ సూచించండి... అభిమానులను కోరిన సచిన్


మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ-ఫీచర్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ సూచించమంటూ అభిమానులను సచిన్ స్వయంగా కోరాడు. "నా జీవిత కథ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ-ఫీచర్ రూపొందబోతుందని ప్రకటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. 'ravi0404', '200NOTOUTFILMS' సహకారంతో తెరకెక్కనుంది. ఇందులో అభిమానులందరినీ భాగస్వామ్యులను చేయాలనుకుంటున్నా. ఈ చిత్రానికి ఏ టైటిల్ అయితే బాగుంటుందో సూచించండి. మీ ఆలోచనలు, అభిప్రాయాలను http:// Bit.ly/NameMyMovieకి పంపండి. నా సినిమాకు మంచి టైటిల్ సూచించిన వారికి ప్రత్యేక బహుమతి ఉంటుంది. మీకోసం నేను ఎదురుచూస్తుంటా" అని సచిన్ ట్వీట్ చేశాడు. లండన్ కు చెందిన జేమ్స్ ఎర్కిన్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తుండగా, సచినే ఇందులో నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News