: తృటిలో తప్పిన పెను ప్రమాదం... రన్ వే నుంచి జారిపోయిన విమానం


తృటిలో పెను ప్రమాదం తప్పింది. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టర్కిష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం ప్రతికూల వాతావరణం కారణంగా గంటసేపు గాలిలో చక్కర్లు కొట్టింది. ఇంధనం అయిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కురుస్తున్న మంచు కారణంగా రన్ వే తడిసి ముద్దైంది. దీంతో ల్యాండ్ అవుతూ విమానం అదుపుతప్పింది. రన్ వే నుంచి జారిపోయి పొలాల్లోకి వెళ్లిపోయింది. దీంతో విమానం విపరీతమైన కుదుపులకు లోనైంది. ఈ సమయంలో విమానం సిబ్బంది సహా 227 మంది ప్రయాణికులున్నారని, అంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కుదుపుల కారణంగా స్వల్పంగా గాయపడ్డ ప్రయాణికులను ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News