: మద్యం డిపోలకు ఐటీ నోటీసులపై హైకోర్టు స్టే


ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బెవరేజెస్ కు హైకోర్టులో ఊరట కలిగింది. ఏపీలోని 22, తెలంగాణలోని 17 మద్యం దుకాణాలకు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై కోర్టు స్టే విధించింది. మద్యం విక్రయం ద్వారా వచ్చే డబ్బును మద్యం డిపోల బ్యాంకుల్లో జమ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు బెవరేజెస్ లు ఐటీ శాఖకు రూ.8వేల కోట్లు బకాయిపడ్డాయి. ఇంతవరకు నగదు చెల్లించకపోవడంతో రెండు రోజుల కిందట ఐటీ శాఖ నోటీసు ఇచ్చింది. అంతేగాకుండా మద్యం సరఫరా కూడా నిలిపివేసింది. దాంతో మూడు రోజులుగా పలు మద్యం దుకాణాలు మూతబడ్డాయి.

  • Loading...

More Telugu News