: తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న స్మిత్... 400 స్కోరు దిశగా ఆసీస్
పసికూన ఆఫ్ఘనిస్థాన్ పై ఆస్ట్రేలియా ప్రతాపం చూపుతోంది. ఆఫ్ఘన్ బౌలింగును ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఊచకోత కోస్తున్నారు. ఈ క్రమంలో 98 బంతుల్లో 95 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్స్) చేసిన స్మిత్ షాపూర్ జర్దాన్ బౌలింగులో ఔట్ అయ్యాడు. మరో వైపు మ్యాక్స్ వెల్ వీర విహారం చేస్తున్నాడు. కేవలం 29 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో 6 పరుగులతో ఫాల్కనర్ ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 366 పరుగులు.