: వార్నర్ 178 ఔట్... భారీ స్కోరు దిశగా ఆసీస్
ప్రపంచకప్ లో భాగంగా పెర్త్ లో ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. 14 పరుగులకే ఓపెనర్ ఫించ్ వికెట్ కోల్పోయినప్పటికీ, డేవిడ్ వార్నర్, స్మిత్ లు ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో, డేవిడ్ వార్నర్ 178 (133 బంతులు, 19 ఫోర్లు, 5 సిక్సర్లు) వ్యక్తిగత పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. స్మిత్ 88, మ్యాక్స్ వెల్ 17 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 299 పరుగులు. షాపూర్ జద్రాన్, దౌలత్ జద్రాన్ లు చెరో వికెట్ తీశారు.