: ఎప్పుడూ ఇబ్బంది పెట్టని నిత్యామీనన్... ఇప్పుడు రెండు అడుగుతోంది
హీరోయిన్ నిత్యామీనన్ స్టైలే వేరు. సినిమాలో స్టార్ హీరో ఉన్నా, పేరున్న డైరెక్టర్ సినిమా అయినా నిత్య డోంట్ కేర్ అంటుంది. ఆమెకు నచ్చాల్సింది పాత్ర మాత్రమే. క్యారెక్టర్ మంచిదైతే రెమ్యునరేషన్ విషయాన్ని కూడా నత్యామీనన్ పెద్దగా పట్టించుకోదట. అలాంటి నిత్య ఈ మధ్య ఓ నిర్మాతకు భారీ షాక్ ఇచ్చిందట. బాలీవుడ్ లో హిట్ అయిన 'క్వీన్' సినిమాను దక్షిణాది భాషల్లోకి అనువదించాలని నిర్మాత త్యాగరాజన్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమాలో కంగనా రనౌత్ చేసిన పాత్రకు సమంత, నయన్, అనుష్క తదితరుల పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు నిత్యామీనన్ ను సంప్రదించారట. ఏమాత్రం లేట్ చేయని నిత్య సినిమాకు ఓకే చెప్పిందట. అయితే రూ. 2 కోట్ల పారితోషికం కావాలని కోరిందట. దీంతో, త్యాగరాజన్ బిత్తరపోయారట. నిత్యకు రెండు కోట్లు ఇచ్చే బదులు మరో స్టార్ హీరోయిన్ ను పెట్టుకుంటే, సినిమాకు పబ్లిసిటీ కూడా వస్తుందనే ఆలోచనలో పడ్డారట.