: మల్లికా శెరావత్ 'డర్టీ పాలిటిక్స్' విడుదలపై నిషేధం
అందాల భామ మల్లికా శెరావత్ నటించిన 'డర్టీ పాలిటిక్స్' విడుదలపై పాట్నా హైకోర్టు డివిజన్ బెంచ్ నిషేధం విధించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు, ఈ చిత్రంలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను తొలగించేంతవరకు విడుదల చేయవద్దని సదరు అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. ఇందులో దేశ జాతీయ జెండాను మల్లిక తన దేహంపై కప్పుకుని జెండాను అగౌరవపరచిందని, అవమానించిందంటూ పిటిషనర్ ఫిర్యాదు చేశాడు. కేసీ.బొకాడియా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకావల్సి ఉంది.