: షార్ట్ సర్క్యూట్ తో ఆగిన 'క్యూరియాసిటీ'
అంగారక గ్రహంపై పరిశోధనలు సాగిస్తున్న 'క్యూరియాసిటీ' షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆగిపోయింది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది. రోవర్ 'క్యూరియాసిటీ' తన పనిని తాత్కాలికంగా ఆపిందని, సమస్యను పరిష్కరించేందుకు ఇంజినీర్లు కృషి చేస్తున్నారని తెలిపింది. షార్ట్ సర్క్యూట్ తో రోవర్ చేతులు పనిచేయడం ఆగిపోయాయని నాసా వివరించింది. ప్రస్తుతం 'క్యూరియాసిటీ' కండిషన్ పై పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. ఈ పరీక్షలు పూర్తి అయేందుకు చాలాకాలం పట్టవచ్చని తెలిపింది. ఇంజనీర్ల సంకేతాలను రోవర్ గ్రహిస్తోందని వివరించింది.