: ఆర్బీఐ హోలీ బహుమతి... అనుకోని విధంగా వడ్డీ రేట్ల తగ్గింపు


ఎవ్వరూ ఊహించని విధంగా భారతీయులకు హోలీ బహుమతిని ఆర్బీఐ అందించింది. రెండు నెలల వ్యవధిలో రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ ఉదయం రేపో రేటును పావు శాతం మేరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందని ప్రకటించింది. ఈ మార్పు తరువాత 7.75 శాతం వద్ద వున్న రెపో రేటు (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే నగదుపై వసూలు చేసే వడ్డీ) 7.50 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల వ్యవస్థలోకి కనీసం 40 వేల కోట్ల రూపాయలు చలామణిలోకి వస్తాయని నిపుణులు వ్యాఖ్యానించారు. దీంతో బ్యాంకులకు నెలవారీ కిస్తీలు చెల్లిస్తున్న అందరూ ఎంతో కొంత లాభాపడవచ్చని అంచనా.

  • Loading...

More Telugu News