: క్రికెట్ లెజెండ్స్ సచిన్, లారా ఫొటోకు వెల్లువెత్తిన అభిమానం... 3 గంటల్లో 3 లక్షల లైక్స్!


ప్రపంచ క్రికెట్ చరిత్రలో వారిద్దరికీ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకరు సుదీర్ఘ కెరీర్ తో తిరుగు లేని రికార్డులు నెలకొల్పి క్రికెట్ గాడ్ గా పేరుగాంచితే, మరొకరు హిట్టింగ్ అంటే, ఏమిటో చూపించిన ధీరుడు. వారే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బ్రయాన్ లారా. వారు ఎక్కడికెళ్లినా అభిమానం వెల్లువే. అదే ఇద్దరూ కలిసి కనిపిస్తే, అభిమానం పోటెత్తడం ఖాయమేగా. అదే జరిగింది. 2015 వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా వారిద్దరూ ఆస్ట్రేలియా వెళ్లారు. ఇద్దరూ కలిసి ఓ ఫొటో తీసుకున్నారు. సదరు ఫొటోను సచిన్ ఫేస్ బుక్ లో పెట్టాడు. దీనికి కేవలం మూడంటే మూడు గంటల్లోనే మూడు లక్షల లైక్స్ వచ్చాయి.

  • Loading...

More Telugu News