: పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాం: ఉమాభారతి
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. ఢిల్లీలో ఆమె పోలవరంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలవరం నిర్మాణంలో చంద్రబాబుకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. పోలవరం అథారిటీ కార్యాలయం ఎక్కడ? అనేది ఇంకా నిర్ణయించలేదని ఆమె వెల్లడించారు. కాగా, పోలవరం పూర్తి చేయడానికి కేవలం 100 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం భగ్గుమన్న సంగతి తెలిసిందే.