: భూసేకరణ బిల్లు ఆమోదం పొందుతుంది: ప్రధాని
భూసేకరణ సవరణ బిల్లు ఆమోదం పొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూసేకరణ చట్ట సవరణపై అవాస్తవాలు ప్రచారం చేయవద్దని అన్నారు. కేంద్రం పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు కేటాయించామని ఆయన చెప్పారు. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ కు 22 వేల కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ కు 15 వేల కోట్ల రూపాయలు, ఒడిశాకు 8 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని ఆయన వెల్లడించారు. కాగా, కేంద్రం సాయంపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే.