: బుద్ధుందా? వాడికి కుర్చీ వేసి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారా?: వెన్నెల కిషోర్


నిర్భయ హత్య కేసు దోషి ఇంటర్వ్యూపై టాలీవుడ్ కమేడియన్ వెన్నెల కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'బుద్ధుందా? వాడికి కుర్చీ వేసి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారా? దీనిని నేను నమ్మలేకపోతున్నా'నని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వాడు చేసిన దారుణంపై పశ్చాత్తాపం లేకుండా స్వాతంత్ర్య సమరయోధుడి లెవెల్లో గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డాడు. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ కూడా దీనిపై నిలదీశారు. 'జరిగిన దారుణ అత్యాచారంపై మీ అభిప్రాయం ఏంటి? రేపిస్టు ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలతో మీలో ఎంత మంది రహస్యంగా ఏకీభవిస్తారు? అత్యాచారంలో నిజంగా మహిళల తప్పుంటుందా?' అని అడిగారు. సానియా మీర్జా ఆధునిక భాషలో స్పందించారు.

  • Loading...

More Telugu News