: ప్రజల కోసం ఏం చేయాలో మాకు తెలుసు: ప్రధాని
ప్రజల కోసం ఏం చేయాలో తమకు తెలుసని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల కోసమే జన్ ధన్ యోజన పెట్టామని అన్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాలు, కేంద్రం భాగస్వామ్యం కావాలని తాము భావిస్తున్నామని అన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలల్లోని మరుగుదొడ్లు కూడా లేవని అన్నారు. దేశ ప్రజలంతా బాగుపడాలంటే డబ్బులు కావాలని అన్నారు. అలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. తాము జన్ ధన్ యోజనతో అలాంటి వ్యవస్థను తీసుకువచ్చామని ఆయన తెలిపారు. 46 శాతం మంది ప్రజలు పట్టణాల్లోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇందులో 60 శాతం మంది సాధారణ ప్రజలేనని ఆయన పేర్కొన్నారు. తాము కార్పొరేట్ వ్యవస్థ కాదని, తమ సంస్కరణల ఫలితాలు నెమ్మదిగా కనబడతాయని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.