: తెలంగాణలో హోలీ సెలవు 5న కాదు 6న!
హోలీ పర్వదినం సందర్భంగా 6వ తేదీన సెలవు ప్రకటిస్తున్నట్టు తెలంగాణ సర్కారు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం నేడు ఉత్తర్వులను వెలువరించింది. సెలవును మార్చడానికి గల కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. కాగా, ఉత్తరాదిన హోలీ పండగ 5వ తేదీన జరగనుంది. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు అద్వాని, సుష్మ స్వరాజ్, బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేతలు సోనియా, దిగ్విజయ్ సింగ్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తదితరులు ప్రతియేటా హోలీ పండగను అభిమానులు, ప్రజలతో కలసి ఘనంగా జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే.