: మోదీ కేబినెట్ లో చేరాలని కేసీఆర్ తహతహలాడుతున్నారు: పొన్నం
నరేంద్రమోదీ కేబినెట్ లో చేరాలని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తహతహలాడుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అందుకే, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగినా... కేంద్రాన్ని కేసీఆర్ ఒక్క మాట కూడా అనలేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రత్యేక హైకోర్టు కావాలని న్యాయవాదులు ఆందోళన చేస్తున్నా... కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ విషయంలో బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడిస్తామని న్యాయవాదులు హెచ్చరించాలని... అప్పుడు రెండు పార్టీలు కూడా దిగొస్తాయని అన్నారు. దీంతోపాటు, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు.