: షార్ లో తొలిసారి పర్యటిస్తున్న ఇస్రో ఛైర్మన్
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన ఛైర్మన్ ఏఎన్ కిరణ్ కుమార్ నేడు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా, పీఎస్ఎల్వీ సీ-27 ప్రయోగానికి సంబంధించిన పనులను ఆయన పరిశీలించారు. ఇస్రో ఛైర్మన్ అయ్యాక షార్ ను ఆయన సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాధాకృష్ణన్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కిరణ్ కుమార్ ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.