: బీజేపీలో విలీనం కానున్న వైకాపా... ఆనం జోస్యం


తనపై వున్న కేసుల నుంచి తప్పించుకునేందుకు వైకాపాను బీజేపీలో విలీనం చేయాలని జగన్ భావిస్తున్నారని కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి విమర్శించారు. ఇప్పటికే అమిత్‌ షా, రాజ్‌ నాథ్‌ తో జగన్ సంప్రదింపులు పూర్తయ్యాయని, ఇక మిగిలింది మోదీతో మాత్రమేనని ఆనం ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలు తిన్న జగన్‌ జగజ్జంత్రి అని ఆరోపించారు. జగన్ ను జైలు భయం వెంటాడుతోందని, అందుకే బడ్జెట్‌ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలిసినా ఇదేంటని నిలదీయడంలేదని అన్నారు. విమర్శిస్తే ఏ కేసు వచ్చి పడుతుందోనని ఆయన వణుకుతున్నారని, ఆయనపై విచారణలో ఉన్న 40 కేసుల్లో ఏదో ఒకదాంట్లో శిక్ష తప్పదని ఆనం జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News