: టీడీపీ మంత్రి, నేతలపై జడ్జి ఆగ్రహం... కోర్టు హాలులోనే ఉండమని నన్నపనేనికి ఆదేశం
సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, ఎంఎల్ఏ కరణం బలరాంలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన కేసు విచారణ నేడు బెంచ్ మీదకురాగా న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. సమన్లు జారీ చేసినా, వారిని ఎందుకు హాజరు పరచలేదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే వివరణ ఇవ్వాలని ఒంగోలు డీఎస్పీని ఆదేశించారు. ఇదే కేసులో విచారణకు హాజరైన తెలుగుదేశం నేతలు నన్నపనేని రాజకుమారి, దివి శివరాం, అరుణలను కోర్టు హాలులోనే వేచి ఉండాలని జడ్జి ఆదేశించారు.