: మూడేళ్లలో టీడీపీ పడిపోవడం ఖాయం... ఆ తర్వాత మనదే రాజ్యం: రాజధాని ప్రాంత రైతులతో జగన్


వైకాపా అధినేత జగన్ ఈ రోజు ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి తదితర గ్రామాల్లోని రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ రైతులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు విమర్శలు గుప్పించారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. రెండు, మూడేళ్లలో టీడీపీ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని, ఆ తర్వాత మన పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి రాగానే రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను లేవనెత్తుతామని అన్నారు. డబ్బుల్లేవంటున్న చంద్రబాబు సింగపూర్ లాంటి రాజధానిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. రైతుల తరపున వైకాపా పోరాటం చేస్తుందని చెప్పారు. చంద్రబాబు రియలెస్టేట్ వ్యాపారిలా మారారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News