: బకాయిల వసూళ్ల కోసం ఇంటింటికీ తిరుగుతున్న విశాఖ ఆంధ్రాబ్యాంకు సిబ్బంది


మొండి బకాయిలు వసూలు చేసేందుకు బ్యాంకు ఉద్యోగులే ఇంటింటికీ తిరుగుతున్నారు. తాజాగా విశాఖ ఆంధ్రా బ్యాంకు ఉద్యోగులు కూడా రోడ్డెక్కారు. బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయిలు కట్టమంటూ అప్పులు తీసుకున్న వారి ఇళ్లకు వెళ్లారు. విశాఖలో గతంలో నిర్మించిన వాంబే కాలనీలో ఇళ్లకోసం ఆంధ్రా బ్యాంకు 380 మందికి రూ.25 కోట్లు అప్పులు ఇచ్చింది. వాటిలో లబ్దిదారుల నుంచి ఇంకా రూ.15 కోట్ల వరకు బ్యాంకుకు రావాల్సి ఉంది. చాలాకాలంగా ఈ సొమ్మును తీసుకున్నవారు ఎంతకూ చెల్లించడంలేదు. చేసేదిలేక బకాయిలు చెల్లించాలంటూ వారే లబ్దిదారులు ఇళ్లకు వెళ్లి అడుగుతున్నారు.

  • Loading...

More Telugu News