: ఒకనాడు నన్ను బహిష్కరించిన వారే... ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు: దాల్మియా


బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగ్మోహన్ దాల్మియా క్రికెట్ బోర్డులో మళ్లీ తనదైన హవా కొనసాగించనున్నారు. దశాబ్దకాలం తరువాత మళ్లీ పగ్గాలు చేపట్టడంపై కోల్ కతా ఎయిర్ పోర్డులో ఆయన స్పందిస్తూ, "ఒకప్పుడు నన్ను బహిష్కరించిన వారే (క్రికెట్ బోర్డు నుంచి) ప్రస్తుతం నన్ను ప్రోత్సహిస్తున్నారు" అని అన్నారు. కాగా బీసీసీఐ ఎన్నికలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్యాంప్ కు చెందిన అనురాగ్ ఠాకూర్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అయితే దాల్మియా, ఠాకూర్ కలసి పని చేస్తారా? అనే అనుమానం తలెత్తుతోంది. "ఇదేమి సమస్య కాదు. భారత క్రికెట్ అభ్యున్నతి కోసం ఓ జట్టుగా మేము కలసి పనిచేస్తాం" అని దాల్మియా అంటున్నారు.

  • Loading...

More Telugu News