: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా?... ఇలా ట్రై చేయండి!


స్మార్ట్ ఫోన్‌ యూజర్లను ప్రధానంగా కలవరపెట్టే సమస్య బ్యాటరీ బ్యాకప్‌. బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందని బాధపడని యూజర్ ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఈ సమస్య పరిష్కారానికి బ్యాటరీ సేవర్‌ అప్లికేషన్‌లు, ఆప్టిమైజర్లు అందుబాటులో ఉన్నప్పటికి పెద్దగా ఫలితాలేమి కనిపించటంలేదు. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా స్మార్ట్ ఫోన్‌ బ్యాటరీని ఆదా చేసుకునే మార్గాలు వున్నాయి. వీటిల్లో ముఖ్యమైనది ఏఏ యాప్స్ ఎక్కువ బ్యాటరీని వాడుకుంటున్నాయో చూసి వాటిలో అవసరం లేని వాటిని తొలగించడం. బ్యాటరీ సెట్టింగ్‌‌ లోకి వేళితే ఈ సమాచారం తెలుస్తుంది. దీంతోపాటు స్క్రీన్ బ్రైట్ నెస్ ను తగ్గించి పెట్టుకోవాలి. స్క్రీన్‌ సేవర్‌లను అధికంగా ఉపయోగించకూడదు. అవసరం లేని సమయాల్లో బ్లూటూత్‌, వై-ఫై, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఆఫ్‌ చేసి ఉంచటం ద్వారా బ్యాటరీ మరింత సేపు నిలిచివుండేలా చేయొచ్చు. నోటిఫికేషన్ లను డిసేబుల్ చేయడం, యాప్స్ ఆటో అప్ డేట్ ఆప్షన్ ఆపివేయడం కూడా బ్యాటరీ బ్యాక్ అప్ ను పెంచుతుంది. సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్‌ లెవల్‌‌ జీరో స్థాయికి చేరుకున్న తరువాత రీచార్జ్ మొదలుపెట్టండి. దీనివల్ల బ్యాటరీ జీవిత కాలం రెట్టింపు అవుతుంది. అవసరం లేని సమయంలో బ్లూటూత్ వంటి వాటిని ఆఫ్‌ చేయటం ఉత్తమం. వీటితోపాటు ఒక పోర్టబుల్ చార్జర్ ను వెంట ఉంచుకోవడం మంచిది. ప్రస్తుతం రూ.300 లోపు ధరలోనే పోర్టబుల్ చార్జర్ లభిస్తోంది. ఈ సూచనలు పాటిస్తే మీ స్మార్ట్ ఫోన్ మరింత సేపు చార్జింగ్ అవసరం లేకుండా పనిచేస్తుంది.

  • Loading...

More Telugu News