: కేసీఆర్ కు పదవీగండం ఉందట... పదవిని మరొకరికి ఇవ్వక తప్పదట


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పదవీగండం ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఏ వార్తా చానల్ డిస్కషన్ కు వెళ్లినా ఈ విషయం గురించి మాట్లాడటం మాత్రం ఆయన ఆపడం లేదు. 2016 జూన్ నాటికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండరని చెబుతున్నారు. కేసీఆర్ కు ఏదో అవుతుందని తాను చెప్పడం లేదని... అయితే, తన పదవిని ఎవరో ఒకరికి అప్పగించాల్సిన పరిస్థితి దాపురిస్తుందని... ఈ విషయాన్ని జ్యోతిష్కం సూచిస్తోందని అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగననే కోణంలో కేసీఆర్ అనేక సవాళ్లు విసురుతున్నారని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News