: అదో బ్రహ్మచారుల క్లబ్... ఆరెస్సెస్ పై మజ్లిస్ నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్య


మజ్లిస్ తెలంగాణ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలనాలకు కేంద్ర బిందువు. ఇప్పటికే విద్వేషపూరిత ప్రసంగం చేసిన ఆయనపై దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటనలకు పోలీసులు అనుమతులు కూడా ఇవ్వడం లేదు. మెదక్ జిల్లా కలెక్టర్ ను దూషించిన కేసులో ఇప్పటికీ సంగారెడ్డి కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు. తాజాగా ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)పై విరుచుకుపడ్డారు. ఆరెస్సెస్ ను బ్రహ్మచారుల క్లబ్ గా ఆయన అభివర్ణించారు. అవివాహితులుగానే మిగిలిపోతున్న ఆరెస్సెస్ నేతలు... మరింత మంది పిల్లల్ని కనండని హిందువులకు చెబుతున్నారని, వారికి ఆ అర్హత లేదని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. మజ్లిస్ వ్యవస్థాపక దినం సందర్భంగా నిన్న ఆయన ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ పేరును ప్రస్తావించకుండానే ఆయన ప్రకటనలపై అక్బరుద్దీన్ విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News