: కేసులకు భయపడే జగన్ కిమ్మనట్లేదు... తెలుగు పత్రిక సంచలన కథనం!


ఏపీకి అన్యాయం జరిగిన తీరుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కిమ్మనకపోవడంపై ఓ తెలుగు దినపత్రిక సంచలన కథనాన్ని రాసింది. తనపై నమోదైన కేసుల కారణంగానే జగన్ నోరు మెదపడం లేదని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని చెప్పిన సదరు కథనం, ఇటీవల పరిణామాలను ప్రస్తావిస్తూ కారణాలను కూడా వెతికే యత్నం చేసింది. అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్, వాటిని మాఫీ చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారట. అయినా పార్టీని బతికించుకునే క్రమంలో నిత్యం ఏదో ఒక అంశంపై ధర్నాలు, యాత్రలు చేస్తున్న జగన్, ఏపీకి జరిగిన అన్యాయంపై నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభులను కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించి జగన్ పలు డిమాండ్లను మంత్రుల ముందు పెట్టారట. సదరు వినతి పత్రాలను ఇద్దరు మంత్రులు తేలిగ్గా తీసిపారేశారట. పరిస్థితిని అర్థం చేసుకున్న జగన్, రెండు బడ్జెట్లలో ఏపీకి జరిగిన అన్యాయంపై నోరు విప్పడం లేదని సదరు కథనంలో ఆ పత్రిక తెలిపింది.

  • Loading...

More Telugu News