: రేపు మరోసారి డివిలీర్స్ విజృంభణ చూడొచ్చు: షాన్ పొలాక్


రేపు సౌతాఫ్రికా కెప్టెన్ డివిలీర్స్ విజృంభణ మరోసారి చూడవచ్చని సఫారీ మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో ఆయన మాట్లాడుతూ, వెస్టిండీస్ పై ఆడిన ఇన్నింగ్స్ లాంటిది మరోసారి చూడాలనుకుంటే రేపు మ్యాచ్ చూడవచ్చని అన్నాడు. రేపు ఓవల్ లో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పొలాక్ ఐర్లాండ్ ను హెచ్చరిస్తున్నాడు. డివిలీర్స్ అద్భుతమైన క్రికెటర్ అని, విండీస్ పై చెలరేగిన తీరు అద్భుతమని పేర్కొన్నాడు. రేపటి మ్యాచ్ లో అదేతీరుగా రెచ్చిపోతాడని తాను భావిస్తున్నానని అన్నాడు.

  • Loading...

More Telugu News