: కాస్ట్యూమ్ డిజైనర్ అవతారమెత్తిన ప్రకాశ్ రాజ్ మాజీ భార్య
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయన మాజీ భార్య లలిత కుమారి కాస్ట్యూమ్ డిజైనర్ అవతారమెత్తారు. ప్రస్తుతం వర్ధమాన నటులతో రూపొందుతున్న సీఎస్కే (చార్లెస్ షఫీక్ కార్తీక) చిత్రానికి ఆమె కాస్ట్యూమ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అంతేగాదు, సీఎస్కే దర్శకుడు సత్యమూర్తి శరవణన్, మ్యూజిక్ డైరక్టర్ని, మాటల రచయితను లలిత కుమారి ఎంతగానో ప్రోత్సహించిందట. ఆ సినిమా యూనిట్ సభ్యులే ఆమెను ఆకాశానికెత్తేస్తున్నారు. లలిత కుమారి లేకుంటే సీఎస్కే చిత్రం లేదని దర్శకుడు సత్యమూర్తి ఆడియో వేడుకలో స్పష్టం చేశారు. అదే వేదికపై లలిత కుమారి మాట్లాడుతూ, తన కుమార్తెకు సత్యమూర్తే చిత్రలేఖనంలో ప్రాథమిక శిక్షణ ఇచ్చారని, ఇప్పుడామె విదేశాల్లో ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేస్తోందంటే అందుకు ఆయనే కారణమని తెలిపింది. సత్యమూర్తికి ఏదైనా ఉపకారం చేయాలన్న ఉద్దేశంతోనే అతడిని ప్రకాశ్ రాజ్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా చేర్చానని వివరించింది. అన్నట్టు... లలిత కుమారి మన డిస్కో శాంతికి సోదరే.