: నష్టాల నుంచి స్వల్ప లాభాల్లోకి!


స్టాక్ మార్కెట్ సెషన్ ఆరంభంలోని లాభాలు మధ్యాహ్నానికి హరించుకుపోగా, ఒడిదుడుకుల మధ్య సాగిన సెషన్ చివరికి స్వల్ప లాభాల్లో ముగిసింది. యూరప్ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో, 2 గంటల తరువాత కొనుగోలు మద్దతు కనిపించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బ్యాంకులు, హెల్త్ కేర్, వాహన రంగాల్లోని కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపారు. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 97.64 పాయింట్లు పెరిగి 0.33 శాతం లాభంతో 29,459.14 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 54.90 పాయింట్లు పెరిగి 0.62 శాతం లాభంతో 8,956.75 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.31 శాతం, స్మాల్ క్యాప్ 0.93 శాతం పెరిగాయి. అల్ట్రా సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, సిప్లా తదితర కంపెనీలు లాభపడగా, ఐటీసీ, జిందాల్ స్టీల్, బజాజ్ ఆటో, హీరో మోటో, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News