: 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న 'నటకిరీటి' రాజేంద్రప్రసాద్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యవర్గానికి ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి 'మా' అధ్యక్ష పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు 'నటకిరీటి' రాజేంద్రప్రసాద్ తెలిపారు. సంఘానికి అధ్యక్షుడిగా సేవలు అందించాలని ఉందని ఆయన తన మనసులోమాట తెలిపారు. ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తున్నానని, ఒకవేళ ఎవరైనా బరిలో దిగినా, తాను పోటీ పడతానని వివరించారు. ప్రస్తుతం 'మా' అధ్యక్షుడిగా మురళీమోహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.