: వందకోట్లు ముష్టి పడేస్తారా?... కేంద్రంపై నిప్పులు చెరిగిన బాలకృష్ణ


ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో స్పందించారు. వందకోట్లు పడేసి పోలవరం కట్టుకోమంటారా? అంటూ మండిపడ్డారు. వేరే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా విషయంలో లేని ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ విషయంలో వచ్చిందా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే జనం తిరగబడతారని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ నేడు రాయలసీమ జిల్లాల్లో కొనసాగుతున్న హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు.

  • Loading...

More Telugu News