: ఏపీ, తెలంగాణలోని మద్యం దుకాణాలకు సరఫరా నిలిపివేత


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దుకాణాలకు మద్యం సరఫరా నిలిచిపోయింది. రెండు రాష్ట్రాల్లోని బెవరేజెస్ కార్పోరేషన్లు రూ.1500 కోట్లకు పైగా పన్ను రూపేణా చెల్లించాల్సి ఉంది. దాంతో, ఐటీ శాఖ పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అంతేగాక, సదరు మద్యం దుకాణాలకు మద్యం సరఫరా నిలిపివేయాలని అధికారులకు ఏజీ సూచించారు. ఈ క్రమంలో ఏపీలో 22, తెలంగాణలో 17 కేంద్రాల నుంచి దుకాణాలకు సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల బెవరేజెస్ కార్పోరేషన్లు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News