: ప్రీతిజింటాతో యువరాజ్ సింగ్ సహజీవనం!
బాలీవుడ్ అందాల భామ, సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా మరోసారి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. క్రికెట్ స్టార్ యువరాజ్ సింగ్ తో ప్రేమాయణం నడపడమే కాదు, ఏకంగా సహజీవనం చేస్తోందనే వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. మాజీ ప్రియుడు నెస్ వాడియాతో వివాదం చెలరేగినప్పుడు ప్రీతి చాలా ఒత్తిడికి గురయింది. ఆ సమయంలో ఈ అందాల భామకు యువరాజ్ సింగ్ ఆపన్నహస్తం అందించాడట. అండగా నిలబడి, ఆత్మస్థైర్యాన్ని నింపాడట. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య బంధం బలపడి, ప్రేమకు దారితీసిందని తెలుస్తోంది. అయితే, తాను యువరాజ్ తో సహజీవనం చేయడంలేదని ఇటీవలే ప్రీతి ట్విట్టర్ లో ఖండించింది. అయినప్పటికీ, ఈ వార్త దేశవ్యాప్తంగా వాయువేగంతో విస్తరిస్తూనే ఉంది.