: లోక్ సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బిల్లులో ఎన్నో తప్పులున్నాయని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనికితోడు, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలను పెంచడానికి సంబంధించిన మరో చట్ట సవరణ బిల్లును కూడా సభ ముందుకు తీసుకువచ్చారు. మరోవైపు, పాక్ వల్లే కాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్న జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ వ్యాఖ్యలపై పార్లమెంటు అట్టుడుకుతోంది.