: అంతరిక్షంపై రష్యా పట్టు పెరుగుతోంది


అంతరిక్షంపై పట్టు సాధించే విషయంలో రష్యా ఒక్కొక్క అడుగు చురుగ్గా ముందుకు వేస్తోంది. ఎలాగైనా సరే అంగారకుడి మీదికి మనుషుల్ని పంపే ప్రయోగాలను కార్యరూపంలోకి తేవడానికి కుస్తీలు పడుతున్న రష్యా స్పేస్‌ వాక్‌లను ఎనిమిది దఫాలుగా నిర్వహించి.. ఫలితాలను విశ్లేషించడానికి కూడా సంకల్పించింది. ఈ ప్రక్రియలో భాగంగానే.. శుక్రవారం నాడు అంతర్జాతీయ రోదసి కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యోమగాములు.. అందులోంచి బయటకు వచ్చి... అంతరిక్షంలో నడిచారట. తమ వ్యోమగాములు పావెల్‌ వినోగ్రాడోవ్‌, రోమన్‌ రొమానెంకో ఈ సాహసం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ ఏడాదిలో 8 స్పేస్‌ వాక్‌లను రష్యా ప్లాన్‌ చేస్తోంటే .. అందులో ఇది మొదటిది. ఒక్కొక్క ప్రయోగాన్ని సక్సెస్‌ చేసుకుంటూ.. అమెరికాకు దీటుగా అంతరిక్ష ప్రయోగాల్లో ముందంజలో ఉండాలని రష్యా ఉవ్విళ్లూరుతోంది.

  • Loading...

More Telugu News